Meera Mithun: సినీనటి మీరా మిథున్‌కు బెయిల్‌ నిరాకరణ

Actress Meera Mithun bail rejected
  • దళిత దర్శకులు, నటీనటులపై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు
  • సినీ పరిశ్రమ నుంచి దళితులను తరిమికొట్టాలని వ్యాఖ్య
  • ప్రస్తుతం జైల్లో ఉన్న మీరా మిథున్

దళిత నటీనటులు, దర్శకులపై హీరోయిన్ మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరివల్ల తనకు సినీ అవకాశాలు దెబ్బ తిన్నాయని... సినీ పరిశ్రమ నుంచి దళితులను తరిమికొట్టాలని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దళిత దర్శకులు తీస్తున్న సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ విలువ తగ్గిపోతోందని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో ఆమెపై వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆమె కేరళకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఆచూకీని తెలుసుకున్న పోలీసులు కేరళకు వెళ్లి, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరోవైపు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News