Mercedes Benz India: భారత్ లో అత్యంత వేగవంతమైన ఎస్ యూవీని ప్రవేశపెట్టిన మెర్సిడెస్ బెంజ్

Mercedes launches latest model suv in AMG series
  • భారత్ లో ఎంట్రీ ఇచ్చిన ఏఎంజీ జీఎల్ఈ 63ఎస్
  • ధర రూ.2.07 కోట్లు
  • 612 హార్స్ పవర్ శక్తి
  • 3.8 సెకన్లలోనే 100 కిమీ వేగం
  • టాప్ స్పీడ్ గంటకు 280 కిమీ

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ భారత్ లో తన అత్యంత వేగవంతమైన ఎస్ యూవీని ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగం తాజాగా ఏఎంజీ జీఎల్ఈ 63ఎస్ 4మాటిక్ ప్లస్ కూపే ఎస్ యూవీని నేడు లాంచ్ చేసింది. దీని ధర రూ.2.07 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూం). దీంట్లో 612 హార్స్ పవర్ తో కూడిన శక్తిమంతమైన ట్విన్ టర్బో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ను పొందుపరిచారు. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలోనే అందుకోగలదు. ఈ వాహనం గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు. ఏఎంజీ సిరీస్ లో ఇది 12వ మోడల్.

మెర్సిడెస్ తన బ్రాండ్ నేమ్ కు దీటుగా తాజా ఏఎంజీ మోడల్లో ఇంటీరియర్స్, ఎక్స్ టీరియర్స్ పై అత్యంత శ్రద్ధ చూపింది. కాగా, ఏఎంజీ మోడల్ అభిమానులు ఈ కారులో తమ కోరిక మేరకు కార్బన్ ఫైబర్ తయారీ ఉపకరణాలను ఎంచుకునే వీలుంది.

ఇన్ స్ట్రుమెంట్, ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ కోసం 12.3 అంగుళాల స్క్రీన్, త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్, అల్యూమినియం షిఫ్ట్ పెడల్స్, నప్పా లెదర్ సీటింగ్ ఈ కారులో ప్రత్యేకతలు. భారత్ లో ఇప్పటికే ఉన్న ప్రీమియం వెర్షన్ ఎస్ యూవీలు లాంబోర్ఘిని ఉరుస్, పోర్షే కయానే టర్బో, ఆడి ఆర్ఎస్ క్యూ8 మోడళ్లకు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్ఈ 63ఎస్ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News