Vote for Note Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

  • సుప్రీంలో రేవంత్, సండ్ర పిటిషన్లు
  • కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ పిటిషన్
  • కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ సండ్ర పిటిషన్
Hearing in vote for note case is adjourned

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో సండ్ర పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్లపై ఎల్లుండి విచారణ జరుపుతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం తెలిపింది. మరోవైపు, ఇదే విషయమై సండ్ర వేసిన పిటిషన్ ను గత ఏడాది తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు.

More Telugu News