Guntur District: కూలిన మంగళగిరి దేవస్థానం ప్రహరీ.. 200 ఏళ్ల చరిత్ర!

  • దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిన ప్రహరీ
  • శనివారం కురిసిన వర్షాల వల్లేనంటున్న అధికారులు
  • శిథిలాల కింద బైక్‌లు, తోపుడు బండ్లు!
Compound wall of Mangalagiri temple Collapsed

200 ఏళ్ల చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రహరీలో కొంత భాగం గత రాత్రి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిజానికి ఆ ప్రాంతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల కారణంగా నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, శిథిలాల కింద కొన్ని ద్విచక్రవాహనాలు, తోపుడుబండ్లు ఉన్నట్టు తెలుస్తోంది.

దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ ప్రహరీని దక్షిణ గాలి గోపురానికి దగ్గరలో రాతితో నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగానే దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిపోయినట్టు చెబుతున్నారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాటిని వెలికి తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

More Telugu News