తెలంగాణలో కొత్తగా 231 మందికి కరోనా పాజిటివ్

Telangana corona cases report
  • గత 24 గంటల్లో 46,987 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 66 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,384 మందికి చికిత్స
తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 46,987 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 231 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,44,747 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,384 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,858కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News