ఏపీలో మరో 1,085 మందికి కరోనా
- గత 24 గంటల్లో 57,745 కరోనా పరీక్షలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 137 కేసులు
- రాష్ట్రంలో 8 మంది మృతి
- ఇంకా 14,677 మందికి చికిత్స
అదే సమయంలో 1,541 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,02,340 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,73,940 మంది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,723కి పెరిగింది.