TTD: పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి!

  • కరోనా నేపథ్యంలో సామాన్య భక్తులకు సర్వదర్శనం నిలిపివేత
  • టికెట్ కొనుక్కుని ఎవరైనా స్వామి వారిని దర్శించుకోవచ్చన్న మంత్రి
  • కరోనా తగ్గుముఖం పడితే సర్వదర్శనానికి అనుమతి
vellampalli srinivasarao visits tirumala with 67 follwers

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న తన 67 మంది అనుచరులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమైంది. కరోనా నేపథ్యంలో సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 67 మందితో కలిసి మంత్రి శ్రీవారిని దర్శించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు తప్పేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి అయినా, సామాన్య భక్తుడైనా దర్శనం టికెట్ కొనుక్కుని స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. కరోనా తగ్గుముఖం పడితే సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే, త్వరలోనే టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

More Telugu News