ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట కర్ఫ్యూను మరోసారి పొడిగించిన సర్కారు
- కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో నిర్ణయం
- సెప్టెంబర్ 4 వరకు పొడిగింపు
- ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 వరకు ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని , రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, ఏపీలో ప్రతిరోజు దాదాపు 1,500 కేసులు నమోదవుతోన్న విషయం తెలిసిందే.