చైనా వాళ్లు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు: కంగనా రనౌత్

19-08-2021 Thu 18:10
  • తాలిబన్లపై నేను పెట్టిన స్టోరీ కూడా మాయమైంది
  • ఆ తర్వాత గంటకి అకౌంట్ మాయమైంది
  • ఇదంతా అంతర్జాతీయ కుట్రలో భాగం
China hacked my instagram account says Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ న్యూస్ హెడ్ లైన్స్ లోనే ఉంటారు. ముక్కు సూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆమె చెప్పారు. చైనా తన ఇన్స్టా అకౌంట్ ను హ్యాక్ చేసిందని తెలిపారు. తాలిబన్లపై తాను చేసిన పోస్టులు కూడా కనిపించడం లేదని చెప్పారు. తెల్లవారుజామున లేని చూసేసరికి తాలిబన్ల గురించి తాను పెట్టిన స్టోరీ కనిపించలేదని... ఆ తర్వాత గంటకి తన అకౌంట్ కూడా మాయమయిందని తెలిపారు. వెంటనే ఇన్స్టా నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా తన అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్పారు. ఇదంతా అంతర్జాతీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు.