YS Sharmila: హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించిన వైఎస్ షర్మిల.. ఫొటోలు ఇవిగో!

YS Sharmila visited Hyderabad old city
  • రేపు మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం సందర్శన
  • చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు
  • ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడారని వ్యాఖ్య
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. రేపు మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబీర్ పూర్ లో ఉన్న బీబీకా ఆలంను ఆమె సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ముస్లిం సోదరులు, సోదరీమణులతో కలిసి చాదర్ సమర్పించడం జరిగిందని ఆమె ట్వీట్ చేశారు. ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడారని... అదే విధంగా తెలంగాణలో హక్కుల కోసం తాము పోరాడతామని చెప్పారు.


YS Sharmila
Hyderabad
Old City
Bibi Ka Alam
YSRTP

More Telugu News