Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రఘురామకృష్ణరాజు

YSRCP Govt will collapse soon says Raghu Rama Krishna Raju
  • రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది
  • వాస్తవాలను ప్రజలకు చెపితే అర్థం చేసుకుంటారు
  • ఆలయాల భూములను తీసుకోవడం సరికాదు
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ అప్పుల కుప్పతో వైసీపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వానికి సూచించారు. అప్పులు చేయడం కష్టంగా మారిందని, అయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ప్రజలకు చెప్పాలని... వారు కచ్చితంగా అర్థం చేసుకుంటారని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న కంపెనీలను కూడా పంపించేస్తున్నామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... అమరరాజా వంటి కంపెనీలే ఏపీ నుంచి వెళ్లిపోతే... కొత్తగా ఎవరు వస్తారని రఘురాజు ప్రశ్నించారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం కింద 100 ఎకరాల భూమి ఉందని... దాన్ని లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడిచే ఆలయాల భూములను తీసుకోవడం సరికాదని అన్నారు. ఇంత భూదాహం ఎందుకని ప్రశ్నించారు. దేవుడి సొమ్ముపై కన్నేశారని మండిపడ్డారు. పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే, ప్రభాకర్ తో తమకు సంబంధం లేదని వైసీపీ చెపుతోందని అన్నారు. ప్రభాకర్ ఎవరనే విషయం విచారణలో తేలుతుందని చెప్పారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Government

More Telugu News