India: తాలిబన్లతో భారత్​ టచ్​ లో ఉందా?.. విలేకరుల ప్రశ్నకు ఇదీ విదేశాంగ మంత్రి సమాధానం

  • ప్రస్తుతం తాలిబన్ రాజ్యం ప్రారంభ దశలోనే ఉందన్న మంత్రి
  • భారత పౌరులను క్షేమంగా తీసుకురావడంపైనే ఫోకస్
  • కాబూల్ లో పరిణామాలను పరిశీలిస్తున్నామని వెల్లడి
Jaishankar Responds Over Journalist Question On The Talibans

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి భారత్ నేరుగా గానీ, పరోక్షంగా గానీ స్పందించలేదు. అక్కడ చిక్కుకున్న మన వారిని రెండు రోజుల క్రితం సురక్షితంగా తీసుకొచ్చారు. అయితే, దీనిపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఆయన.. తాలిబన్లతో భారత్ టచ్ లో ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం ఇంకా ప్రారంభదశలోనే ఉందన్నారు. ప్రస్తుతానికి కాబూల్ లో జరుగుతున్న పరిణామాలపై సమీక్షిస్తున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలతో తమ చారిత్రక మైత్రి ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే మున్ముందు ఆఫ్ఘనిస్థాన్ తో సంబంధాలను నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతానికి అక్కడ చిక్కుకున్న భారత పౌరుల భద్రత, వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడంపైనే దృష్టి పెట్టామన్నారు. అక్కడి హిందువుల, సిక్కులను క్షేమంగా దేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అన్ని దేశాల్లాగే తామూ ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

More Telugu News