Pakistan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్

News about Pakistan PM Imran Khan going viral
  • ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్
  • పెద్ద సంఖ్యలో వెల్లువెత్తుతున్న సంతాప సందేశాలు
  • ఫేక్ వార్త అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న వైనం
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే వార్త వైరల్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజెన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి... ఇమ్రాన్ ఖాన్ ఎలా చనిపోయాడో కూడా వివరించే ప్రయత్నం చేశారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది.

గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి ఫోటోలు, వీడియోలను ఇప్పుడు కొందరు వైరల్ చేశారు. ఇమ్రాన్ మరణ వార్త నిజం కాదని తేలడంతో అలజడి సద్దుమణిగింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడం పట్ల పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ను వారు టార్గెట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ కు సంబంధించిన వార్త కూడా నిజమేనని భావించారు. ఆ తర్వాత అది ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Pakistan
Imran Khan
Death News
Twitter

More Telugu News