Keerthi Suresh: ఓటీటీకి కీర్తి సురేశ్ మూవీ?

  • తెలుగు తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి క్రేజ్
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • షూటింగు పూర్తిచేసుకున్న 'సానికాయిధమ్'
  • తమిళనాట అంచనాలు ఉన్న సినిమా
Keerthi Suresh movie in OTT

తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మహేశ్ జోడీగా పరశురామ్ దర్శకత్వంలో ఆమె చేస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. 'సంక్రాంతి' కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇక తమిళంలో కీర్తి సురేశ్ ఒక విభిన్నమైన సినిమాను చేసింది. మహేశ్వరన్ దర్శకత్వంలో 'సానికాయిధమ్' రూపొందింది. ఈ సినిమాలో సెల్వ రాఘవన్ కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేశ్ ఇంతకుముందు చేసిన 'పెంగ్విన్' కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలాగే 'సానికాయిధమ్' కూడా ఓటీటీలోనే రానుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

More Telugu News