దళితబంధు పథకంపై విచారణ: తెలంగాణ సర్కారుపై హైకోర్టు అసహనం
- నిబంధనల జీవోను వెబ్ సైట్ లో పెట్టలేదన్న పిటిషనర్
- ప్రజలకు అందుబాటులో ఉంచితే ఇబ్బందేంటని ప్రశ్న
- వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్న కోర్టు
పేద దళితులందరికీ పథకం వర్తిస్తుందని, దానికి సంబంధించి ఇప్పటికే నిబంధనలను ఖరారు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆ నిబంధనలను వ్యాజ్యంలో ఎందుకు పేర్కొనలేదంటూ పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. నిబంధనల జీవోను వెబ్ సైట్ లో పెట్టలేదని కోర్టుకు పిటిషనర్ వివరించారు. దీంతో ఆ జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికొచ్చిన ఇబ్బందేంటని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ, ఆ పిటిషన్ విచారణను ముగించింది.