Amrullah Saleh: తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్

  • ఆఫ్ఘన్ లో సంక్షోభం
  • యావత్ భూభాగం తాలిబన్ల వశం
  • దేశం విడిచి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
  • రాజ్యాంగం ప్రకారం తానే అధ్యక్షుడ్నంటున్న సలేహ్
Amrullah Saleh announced himself as Afghanistan caretaker president

రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు చొచ్చుకురావడంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు-1 అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అందరు నేతలను కలుస్తున్నానని, ఏకాభిప్రాయం దిశగా మద్దతు కూడగడుతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం... దేశాధ్యక్షుడు పరారీలో ఉన్నా, దేశాధ్యక్షుడి గైర్హాజరీలోనూ ఉపాధ్యక్షుడు-1 దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతాడు. ప్రస్తుతం నేను దేశంలోనే ఉన్నాను. నేనే చట్టబద్ధమైన ఆపద్ధర్మ పాలకుడ్ని. ఈ క్రమంలో ఏకగ్రీవం దిశగా అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా" అని అమృల్లా సలేహ్ వివరించారు.

More Telugu News