'వీరమల్లు' నుంచి నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్
- 'వీరమల్లు'లో పవన్ సరసన నాయిక
- షూటింగు దశలో సినిమా
- సంక్రాంతికి విడుదల
- అశోక్ గల్లా జోడీగా 'హీరో'
- దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య
ఈ రోజున తన పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'పంచమి' అనే పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ వదిలిన లుక్ ఆకట్టుకుంటోంది. ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, 'సంక్రాంతి' కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
ఇక అశోక్ గల్లా జోడిగా ఆమె 'హీరో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాకి, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీమ్ కూడా నిధి అగర్వాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ సినిమా నుంచి ఆమె పోస్టర్ ను వదిలారు.