ఏపీలో మరో 1,063 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 59,198 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 211 కేసులు
- అనంతపురం జిల్లాలో 10 మందికి పాజిటివ్
- రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి
అదే సమయంలో 1,929 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 11 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి చేరింది. 19,65,657 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 16,341 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 13,671కి పెరిగింది.