Maharaja Ranjit Singh: పాకిస్థాన్ లో దారుణం.. మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం కూల్చివేత

Maharaja Ranjit Singh statue destroyed in Pakistan
  • లాహోర్ లో ఏర్పాటు చేసిన విగ్రహం ధ్వంసం
  • ఆయన 18వ జన్మదినం సందర్భంగా విగ్రహం ఏర్పాటు
  • ఇప్పటి వరకు విగ్రహంపై మూడుసార్లు దాడులు
మహారాజా రంజిత్ సింగ్ విగ్రహానికి పాకిస్థాన్ లో అవమానం జరిగింది. లాహోర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఆయన  విగ్రహాన్ని పాక్ అధికార పార్టీకి చెందిన కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన పోర్టు అధికారులు దుండగులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహారాజా రంజిత్ సింగ్ 18వ శతాబ్దంలో పంజాబ్ ప్రావిన్సును పరిపాలించారు. లాహోర్ రాజధానిగా పరిపాలన కొనసాగించారు.

ఆయన 180వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహంపై దాడి జరగడం ఇది మూడోసారి. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ప్రత్యేక అధికారాలను రద్దు  చేసిన సందర్భంలో ఒకసారి, 2020 డిసెంబర్ లో రెండోసారి, ఇప్పుడు మూడోసారి దాడులు జరిగాయి.
Maharaja Ranjit Singh
Lahore
Pakistan

More Telugu News