Punch Prabhakar: వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు

Delhi police registered case against YSRCP NRI member Punch Prabhakar
  • వీడియోలు పోస్టు చేసిన ప్రభాకర్
  • అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు రఘురామ ఫిర్యాదు 
  • స్పందించిన ఢిల్లీ పోలీసులు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • యూట్యూబ్ కు నోటీసులు
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదైంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితర ప్రముఖులపై పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడంటూ వచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వ్యవహారంలో తాజా కేసు నమోదైంది. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.
Punch Prabhakar
Case
Police
New Delhi
YSRCP
NRI
Andhra Pradesh

More Telugu News