బోట్ ఛేజింగ్ సీన్లో డూప్ లేకుండా సుధీర్ బాబు!

16-08-2021 Mon 18:05
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు 
  • గోదావరి బ్యాక్ వాటర్లో ఫైట్ సీన్ 
  • 84 పడవలలో ఫైటర్లు    
Sridevi Soda Center movie update
సుధీర్ బాబు తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నిదానమే ప్రధానమన్నట్టుగా ముందుకు వెళుతున్నాడు. తనకి నచ్చిన కథలకు .. పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'శ్రీదేవి సోడా సెంటర్' రూపొందింది. విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ. లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు, సోడా సెంటర్ నడిపే శ్రీదేవి పాత్రలో ఆనంది నటించారు. 'పలాస 1978' సినిమాతో విజయాన్ని అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాకి బోట్ ఛేజింగ్ సీన్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.
 
గోదావరి బ్యాక్ వాటర్లో 84 పడవలలో ఫైటర్స్ పాల్గొనగా ఈ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. సుధీర్ బాబు డూప్ లేకుండా ఈ యాక్షన్ సీన్ లో పాల్గొనడం విశేషమని చెబుతున్నారు. బోట్ నడపడంలో కొంతకాలం పాటు సుధీర్ బాబు శిక్షణ తీసుకున్న తరువాతనే ఈ సీన్ ను చిత్రీకరించారట. ఈ నెల 27వ తేదీన ఈ సినిమను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.