Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన వందలాది మంది సిక్కులు

More than 200 Sikhs stuck in Afghanistan Gurudwara
  • గురుద్వారాలో చిక్కుకున్న 200కు పైగా సిక్కులు
  • వారిని సురక్షితంగా రప్పించాలని విదేశాంగ మంత్రికి విన్నపం
  • చేతనైనంత సాయం చేసేందుకు తాము సిద్ధమని వ్యాఖ్య

ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశం నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తాలిబన్ల కిరాతక పాలనను గుర్తు తెచ్చుకుని హడలిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం రన్ వేలపై వేలాది మంది గుమికూడారు. మరోవైపు ఆఫ్ఘన్ లోని ఓ గురుద్వారాలో 200 మందికి పైగా సిక్కులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.

ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే సురక్షితంగా వెనక్కి రప్పించాలని భారత విదేశాంగమంత్రి జైశంకర్ ను అమరీందర్ కోరారు. ఈ విషయలో చేతనైనంత చేసేందుకు తమ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు నిన్న అమరీందర్ స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనకు ఎంతమాత్రం మంచివి కావని... సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.

  • Loading...

More Telugu News