యాక్షన్ థ్రిల్లర్ గా 'గంధర్వ'

16-08-2021 Mon 17:34
  • 'వంగవీటి'తో మంచి గుర్తింపు 
  • 'జార్జి రెడ్డి'తో పెరిగిన క్రేజ్ 
  • సెట్స్ పై 'గంధర్వ' మూవీ 
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథ
Gandharva movie as a action thriller
సందీప్ మాధవ్ పేరు వినగానే 'వంగవీటి' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా చూస్తున్నంత సేపు, తెరపై పాత్ర తప్ప సందీప్ మాధవ్ కనిపించడు. ఆ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆయన 'జార్జి రెడ్డి' సినిమా చేశాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా అప్పట్లో 'జార్జి రెడ్డి' ఇలాగే ఉండేవాడేమో అనుకున్నారు.

'జార్జి రెడ్డి' సినిమా తరువాత అందరూ సందీప్ మాధవ్ గురించే మాట్లాడుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తరువాత ఆయన వరుస సినిమాలు చేయడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. తెలుగు ప్రేక్షకులు ఆయన పేరును మరిచిపోయే పరిస్థితికి వచ్చేశారు. ఈ క్రమంలో ఇంతకాలానికి మళ్లీ ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తోంది.
 
ఆయన తాజా చిత్రంగా 'గంధర్వ' రూపొందుతోంది. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాతో దర్శకుడిగా 'అప్సర్' పరిచయమవుతున్నాడు. మధు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.