పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: శ్రీముఖి

16-08-2021 Mon 15:04
  • మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుంది
  • ప్రస్తుతం నా వయసు 28 ఏళ్లు
  • 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా
Waiting to get married says Sreemukhi
ఓ వైపు బుల్లి తెరపై అదరగొడూతూనే, వెండి తెరపై సైతం తళుక్కున మెరుస్తోంది బిజీ యాంకర్ శ్రీముఖి. తాజాగా సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించగా ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో శ్రీముఖి బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని... ఏదైనా మన అదృష్టాన్ని బట్టే జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని... తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది.