England: లార్డ్స్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కలకలం!

  • బంతిని కాళ్లకింద పెట్టి ఆకారాన్ని మార్చే యత్నం
  • స్పందించిన సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా
  • కేప్‌టౌన్ టెస్టును గుర్తుకు తెస్తున్న ఫొటోలు
England vs India 2nd test Ball Tampering photos in social media

భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ బూట్ల కింద బంతిని పెట్టి దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నమేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంతిని బూట్ల కింద ఉంచి అదుముతున్నట్టుగా ఉన్న మూడు ఫొటోలు వైరల్ అవుతుండగా, ఆ ఆటగాళ్లు ఎవరనేది తెలియరావడం లేదు. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు.

ఇది బాల్ ట్యాంపరింగా? లేక, కరోనా నివారణ చర్యా? అని సెహ్వాగ్ చమత్కారంగా స్పందిస్తే.. ‘ఇది బాల్ ట్యాంపరింగేనా?’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. కాగా, తాజా ఫొటోలు 2018 నాటి కేప్‌టౌన్ టెస్టును గుర్తుకు తెస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు శాండ్ పేపర్‌ను ఉపయోగించి బంతిని ట్యాంపరింగ్ చేసేందుకు యత్నించారు. ఈ వివాదంలో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు.

More Telugu News