బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.10 లక్షలు సాయం ప్రకటించిన సీఎం జగన్

15-08-2021 Sun 21:03
  • గుంటూరు జిల్లా విద్యార్థిని హత్య
  • దురదృష్టకరమన్న సీఎం జగన్
  • విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
  • దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలు
CM Jagan announces compensation to Ramya family
గుంటూరు జిల్లాలో రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్యకు గురికావడం పట్ల సీఎం జగన్ స్పందించారు. ఇవాళ గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు.

ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి దిశ చట్టం కింద కఠినశిక్ష పడాలని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.