తెలంగాణలో గత 24 గంటల్లో 245 కరోనా పాజిటివ్ కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో గత 24 గంటల్లో 245 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona cases and deaths bulletin
  • తాజాగా 50,126 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 7,268 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 245 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 52, కరీంనగర్ జిల్లాలో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,52,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,270 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,268 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మరణాల సంఖ్య 3,842కి పెరిగింది.
Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News