ఇక నుంచి బండి సంజయ్ భాగోతాలు బయటపెడతా:ఎమ్మెల్యే మైనంపల్లి

15-08-2021 Sun 19:10
  • భరతమాత ఫొటో అంశంపై వివాదం
  • మైనంపల్లి, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం
  • బండి తనను రెచ్చగొడుతున్నారన్న మైనంపల్లి
  • తనను యూజ్ లెస్ ఫెలో అన్నారని ఆగ్రహం
MLA Mynampally Hanumantha Rao fires on Bandi Sanjay
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భరతమాత ఫొటో విషయంలో జరిగిన వివాదం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బండి సంజయ్ తనను రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి అన్నారు. తనను యూజ్ సెల్ ఫెలో అన్నారని బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా గురించి బండి సంజయ్ కి ఏంతెలుసు? అంటూ మండిపడ్డారు.

ఇక నుంచి బండి సంజయ్ రాసలీలల వ్యవహారాలన్నీ మీడియా ముందు పెడతా అని మైనంపల్లి హెచ్చరించారు. బండి సంజయ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, ఎంపీకి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ అని వ్యంగ్యం ప్రదర్శించారు. మరోసారి మల్కాజ్ గిరిలో అడుగుపెడితే బండి గుండు పగలడం ఖాయమని పేర్కొన్నారు.