పార్టీ అభిమాని కోరిక మేరకు ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

14-08-2021 Sat 13:55
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బొప్పన రాఘవేంద్రరావు
  • చంద్రబాబును చూడాలనేది తన చివరి కోరిక అని చెప్పిన వైనం
  • విషయం తెలిసిన వెంటనే అభిమానిని కలిసిన చంద్రబాబు
Chandrababu meets TDP follower in hospital
టీడీపీ వీరాభిమాని కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకు చెందిన బొప్పన రాఘవేంద్రరావు టీడీపీ వీరాభిమాని. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీని వెన్నంటే ఉన్నారు. తాజాగా వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంపాలై విజయవాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే తన నేత చంద్రబాబును చూడాలనేదే చివరి కోరిక అని కుటుంబసభ్యులకు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు తన కాన్వాయ్ ను బొప్పన రాఘవేంద్రరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి మళ్లించారు. రాఘవేవంద్రరావును పరామర్శించారు. తన కోసం వచ్చిన చంద్రబాబును చూసి రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు.