Sajjanar: హీరో నిఖిల్ ని సత్కరించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్

CP Sajjanar facilitates actor Nikhil
  • కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో చేసిన పనులకు గుర్తింపు
  • తన కార్యాలయంలో సత్కరించిన సజ్జనార్
  • వీడియోను షేర్ చేసిన నిఖిల్
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా నిఖిల్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేసిన పనులు, ఫ్రంట్ లైన్ కొవిడ్ పోలీస్ వారియర్లను కలవడం వంటి పనులకు గుర్తింపుగా సజ్జనార్ సార్ సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నిఖిల్ చెప్పాడు. సజ్జనార్ సత్కరిస్తున్న వీడియోను షేర్ చేశాడు. సత్కార కార్యక్రమం సజ్జనార్ కార్యాలయంలో జరిగింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిఖిల్ పలు సేవా కార్యక్రమాలను చేపట్టాడు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందించాడు. తన వంతుగా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నిఖిల్ నటిస్తున్న '18 పేజెస్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నిఖిల్ డబ్బింగ్ చెపుతున్నాడు.
Sajjanar
Actor Nikhil
Tollywood

More Telugu News