హాలీవుడ్ రేంజ్ లో 'ఏజెంట్' యాక్షన్!

14-08-2021 Sat 10:21
  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ఏజెంట్'
  • సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న అఖిల్
  • యాక్షన్ సీన్ కోసం విదేశాలకు వెళ్లనున్న టీమ్  
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
Agent movie update
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా, రొమాంటిక్ లవ్ తో కూడిన యాక్షన్ తో సాగుతుంది. సాధారణంగా సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ మొరటుగా కాకుండా, చాలా స్టైలీష్ గా .. డిఫరెంట్ గా ఉంటాయి. 'అతిథి' .. 'రేసు గుర్రం' .. 'ధృవ' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

అలాగే 'ఏజెంట్' సినిమాలోను కొత్తగా .. డిఫరెంట్ గా డిజైన్ చేయించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్, విదేశాల్లోనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. 15 నిమిషాల పాటు సాగే ఒక ఛేజింగ్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ హీరోగా పూర్తిస్థాయి మార్కులు కొట్టేయడానికి అఖిల్ రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం గట్టిగానే కసరత్తు చేసి ఆయన సిక్స్ ప్యాక్ ను సాధించాడు. హెయిర్ స్టైల్ పరంగా కూడా ఆయన కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ  సినిమాలో ఆయన జోడీగా 'సాక్షి వైద్య' కనిపించనుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. తమన్ సంగీతం యూత్ ను ఒక ఊపు ఊపేయనుందనే టాక్ వినిపిస్తోంది.