మంత్ర శక్తితో నేనే చంపేశా.. మళ్లీ బతికిస్తానంటూ శవం వద్ద పూజలు: వ్యక్తి అరెస్ట్

14-08-2021 Sat 06:47
  • జగిత్యాల జిల్లాలో ఘటన
  • మంత్రాల వల్లే చనిపోయాడంటూ వ్యక్తిని పట్టుకుని దాడి
  • వారి దెబ్బలకు తాళలేక బతికిస్తానంటూ పూజలు
man arrested for doing puja for dead man alive
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ఉదయం నుంచి శవం వద్ద పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని టీఆర్ నగర్‌లో ఓర్సు రమేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పుల్లయ్య అనే వ్యక్తి మంత్రాల వల్లే రమేశ్ మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని చితకబాదారు.

వారి దెబ్బలకు తాళలేని పుల్లయ్య మంత్రాలతో తానే రమేశ్‌ను చంపానని, మళ్లీ తన మంత్రశక్తితో బతికిస్తానంటూ వారిని నమ్మించాడు. ఉదయం నుంచి శవం వద్ద పూజలు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.