గోవాలో యాక్షన్ ఎపిసోడ్ .. రంగంలోకి దిగిన మహేశ్!

13-08-2021 Fri 19:09
  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • రీసెంట్ గా వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • 'గోవా'లో మొదలైన తదుపరి షెడ్యూల్ షూటింగ్
  • రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఫైట్ సీన్ చిత్రీకరణ  
Sarkaruvari Paata shooting in Goa
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ .. 14 రీల్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. రీసెంట్ గా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా, 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ 'గోవా'లో మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, ఈ సినిమా టీమ్ వర్కింగ్ స్టిల్ ను విడుదల చేసింది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు.

తమన్ సంగీతం ఈ సినిమాకి ఒక పిల్లర్ లా నిలుస్తుందని అంటున్నారు. అలాగే మహేశ్ బాబుతో కీర్తి సురేశ్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీతో కూడిన ఈ సినిమాను 'సంక్రాంతి' కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం లేకపోలేదు.