సీఎం గారూ... డాక్టర్ సునీతకు పెద్ద మనసుతో భద్రత కల్పించండి: వర్ల రామయ్య

13-08-2021 Fri 15:31
  • రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన సునీత
  • అనుమానిత వ్యక్తుల సంచారంపై ఆందోళన
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
Varla Ramaiah asks CM Jagan to arrange security for Dr Sunitha

తమ నివాసం వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారం కనిపిస్తోందని, తమ కుటుంబానికి ముప్పు ఉందని భావిస్తున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కడప ఎస్పీని కోరడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యమైన కేసుల్లో సాక్షులను మాయం చేసి, ఫిర్యాదుదారులను ఇబ్బందులకు గురిచేసే సంస్కృతి నడుస్తోందని వ్యాఖ్యానించారు.

"మీ బాబాయి వివేకా హత్యకేసులో ఫిర్యాదు చేసిన డాక్టర్ సునీత తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు పెద్దమనసుతో ఆమెకు రక్షణ కల్పించండి" అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.