'101 జిల్లాల అందగాడు' కూడా రెడీ!

13-08-2021 Fri 12:24
  • అవసరాల హీరోగా '101 జిల్లాల అందగాడు'
  • హాస్యప్రధానంగా సాగే కథ
  • దర్శకుడిగా రాచకొండ విద్యాసాగర్ పరిచయం
  • ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల
101 Jillala Andagadu release date Confirmed
కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మారడంతో, ఆ సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుని రంగం మీదకి వచ్చేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా '101 జిల్లాల అందగాడు' కూడా చేరిపోయాడు.

ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా రుహాని శర్మ అలరించనుంది. ఈ సినిమాతో దర్శకుడిగా రాచకొండ విద్యాసాగర్ పరిచయం కానున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - ఫస్టు టైమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. నటుడిగా  .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ కి మంచి గుర్తింపు ఉంది. హాస్యభరితమైన కథాకథనాలతో సాగే ఈ సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.