Andhra Pradesh: వివేకానంద రెడ్డి హత్య కేసు: ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడి విచారణ

CBI Inquires YSRCP MP Avinash Reddy Close Aide
  • 68వ రోజు కొనసాగిన సీబీఐ విచారణ
  • అనుమానితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి
  • ఆయనతో పాటు మరో వ్యక్తి హాజరు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా మరో కీలక వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించింది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో 68వ రోజు విచారణ కొనసాగింది.

అందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్ ఆఫీసులో పనిచేసే రఘునాథరెడ్డి అనే వ్యక్తి కూడా విచారణకు వచ్చారు.
Andhra Pradesh
YS Vivekananda Reddy
YS Avinash Reddy

More Telugu News