సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు చాలా గొప్ప పథకం: కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ

12-08-2021 Thu 21:38
  • దళిత బంధు పథకం తీసుకొచ్చిన కేసీఆర్
  • కేసీఆర్ పై సర్వే ప్రశంసలు
  • దళితులు అభివృద్ధి చెందుతారని వ్యాఖ్యలు
  • కేసీఆర్ కు అద్భుతమైన ఆలోచన వచ్చిందని వెల్లడి
Congress leader Survey Sathyanarayana heaps praise on CM KCR
కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పాలనపై యుద్ధం ప్రకటించి, మరింత దూకుడుగా వెళుతుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్వే సత్యనారాయణ సీఎం కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తడం ఆసక్తి కలిగిస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు ఒక అద్భుతమైన పథకం అని కితాబునిచ్చారు. సీఎం కేసీఆర్ కు తప్ప ఇలాంటి ఆలోచన మరెవరికీ రాలేదని వెల్లడించారు. ఈ పథకంతో దళితులు తప్పకుండా అభివృద్ధి సాధిస్తారని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు.  

సర్వే ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కలిశారు. దాంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్టు కథనాలు వినిపించాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కొత్త ప్రచారానికి తెరలేచింది. సర్వే టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటూ ఊహాగానాలు బయల్దేరాయి.