విడాకుల స్పెషలిస్టుగా పోసాని!

12-08-2021 Thu 18:24
  • సుమంత్ హీరోగా 'మళ్లీ మొదలైంది'
  • దర్శకుడిగా కీర్తి కుమార్ పరిచయం
  • లాయర్ కుటుంబరావుగా పోసాని
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్  
Posani playing a importent role in Malli Modalaindi
రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నటుడిగా బిజీగా ఉండటం వలన, రచనకు .. దర్శకత్వానికి కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తెరపై కనిపిస్తే థియేటర్లలో సందడే సందడి. కామెడీ టచ్ ఉన్న పాత్రలను పండించడంలో ఆయన సిద్ధహస్తుడు.  

ఆయన కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన పాత్రలు చాలానే కనిపిస్తాయి. అయితే ఈ మధ్య అనారోగ్య కారణాల వలన గ్యాపు తీసుకున్న ఆయన, మళ్లీ రంగంలోకి దిగిపోయాడు. ఒకదాని తరువాత ఒకటిగా వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతున్నారు. అలా ఆయన చేస్తున్న సినిమానే 'మళ్లీ మొదలైంది'.

సుమంత్ - నైనా గంగూలి నాయకా నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విడాకుల స్పెషలిస్టుగా ముద్రపడిన లాయర్ కుటుంబరావు పాత్రను పోసాని చేస్తున్నాడు. ఆయన పాత్రను .. ఆ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.