'శ్రీదేవి సోడా సెంటర్' రిలీజ్ డేట్ ఖరారు!

12-08-2021 Thu 17:26
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు 
  • శ్రీదేవి పాత్రలో ఆనంది 
  • ఈ నెల 27న థియేటర్లలో రిలీజ్
Sridevi Soda Center will be released on August 27th
సుధీర్ బాబు - ఆనంది జంటగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళ్లింది. పోస్టర్లకు .. టీజర్ .. ట్రైలర్లకు .. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముహూర్తం కుదిరిపోయింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. హీరో లైటింగ్ చేసే సూరిబాబు పాత్రలో .. హీరోయిన్ సోడా సెంటర్ నడిపే శ్రీదేవి పాత్రలో సందడి చేయనున్నారు.

ఆనంది తెలుగు అమ్మాయినే .. తన కెరియర్ తొలినాళ్లలో 'ఈ రోజుల్లో' .. ' బస్టాప్' వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. 'జాంబి రెడ్డి'తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేసింది. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.