అమిత్ షాకు రాయలసీమ బీజేపీ నేతల ప్రత్యేక విన్నపం

12-08-2021 Thu 17:15
  • శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా
  • రాయలసీమను దత్తత తీసుకోవాలని కోరిన ఆ ప్రాంత బీజేపీ నేతలు
  • దీనివల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న నేతలు
Rayalaseema BJP leaders special request to Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత బీజేపీ నేతలు ఒక ప్రత్యేకమైన కోరికను ఆయన ముందు ఉంచారు. రాయలసీమ ప్రాంత వెనుకబాటుతనాన్ని, కరువుకాటకాలను అమిత్ షా దృష్టికి వారు తీసుకెళ్లారు. రాయలసీమను దత్తత తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిని కోరారు.

మీరు దత్తత తీసుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధిపథంలో పరుగులు పెడుతుందని అన్నారు. అయితే వీరి విన్నపం పట్ల అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాయలసీమను అమిత్ షా దత్తత తీసుకుంటే ఆ ప్రాంతంలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.