ఎన్టీఆర్ తో కృష్ణవంశీ 'రైతు'?

12-08-2021 Thu 11:22
  • గతంలో బాలకృష్ణ విన్న కథ 
  • అప్పట్లో పట్టాలెక్కని ప్రాజెక్టు
  • ఎన్టీఆర్ తో చేసే ఉద్దేశంలో కృష్ణవంశీ
  • వరుస ప్రాజెక్టులతో బిజీగా ఎన్టీఆర్  
Krishnavamsi next movie with Ntr
కృష్ణవంశీ .. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు జోరుగా షికారు చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం .. రైతుల సమస్యలు ... వాళ్లు పడుతున్న ఇబ్బందుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రైతుల సమస్యలకు పరిష్కారం చూపడం కూడా జరుగుతుంది.

బాలకృష్ణ తన 100వ సినిమాకిగాను మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కృష్ణవంశీ 'రైతు' అనే ఒక కథను వినిపించాడు. వినోదంతో పాటు సందేశం కూడా కలిగిన కథ కావడం వలన, బాలకృష్ణ ఈ సినిమా చేస్తాడని అనుకున్నారుగానీ అలా జరగలేదు. ఇప్పుడు ఆ కథను ఎన్టీఆర్ తో చేయాలనే పట్టుదలతో కృష్ణవంశీ ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఉన్న ఎన్టీఆర్, ఆ తరువాత కొరటాల సినిమా చేయనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా తరువాత ఇంతకుముందు త్రివిక్రమ్ తో అనుకున్న కథ పట్టాలెక్కనుంది. అంటే .. ఒకవేళ ఎన్టీఆర్ ఓకే అన్నప్పటికీ, అది కార్యరూపం దాల్చడానికి చాలాకాలమే పడుతుందన్న మాట.