Vijayakanth: ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు.. ఎవరూ ఆందోళన చెందొద్దు: డీఎండీకే

Vijayakanth is healthy says MDMK
  • కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్
  • మంగళవారం సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురైన వైనం
  • వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారన్న డీఎండీకే పార్టీ 

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అమెరికాలో సైతం చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడలేదు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఆయన ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత ఏడాది కరోనా బారిన కూడా పడటంతో చైన్నై నందంబాక్కంలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను మియాట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. నిన్న రాత్రి 11 గంటలకు వైద్య పరీక్షలను ముగించుకున్న విజయకాంత్... విరుగంబాక్కంలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. కేవలం వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పింది.

  • Loading...

More Telugu News