బాలయ్యతో తలపడనున్న విజయ్ సేతుపతి!

12-08-2021 Thu 10:48
  • బాలకృష్ణతో గోపీచంద్ మలినేని
  • ఎమోషన్ తో కూడిన యాక్షన్ మూవీ
  • బాణీలు కడుతున్న తమన్
  • త్వరలోనే సెట్స్ పైకి
Vijay Sethupathi plying villain role in Balakrishna movie
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. అందువలన హీరోను ఎదుర్కోవడానికి అంతే పవర్ఫుల్ విలన్ ఉండాలి. అందువలన గోపీచంద్ మలినేని చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించాడు. చివరికి ఆయన విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు.

తమిళంలో విజయ్ సేతుపతికి విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇటీవల కాలంలో తెలుగులోను ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. 'ఉప్పెన' సినిమాలో ఆయన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఇక్కడి నుంచి ఆయనకు భారీ ఆఫర్లు వెళుతున్నాయి. అలా బాలకృష్ణ సినిమా కోసం ఆయనను తీసుకున్నారని అంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి .. ఆయన అభిమానుల అభిరుచికి తగిన ట్యూన్లు అందించడానికి తమన్ రంగంలోకి దిగిపోయాడు. త్వరలోనే పట్టాలపైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. త్రిష పేర్లు వినిపిస్తున్నాయి.