రేపు శ్రీశైలంకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా

11-08-2021 Wed 21:55
  • ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా
  • బేగంపేట నుంచి హెలికాప్టర్ లో శ్రీశైలంకు పయనం
  • అనంతరం తిరిగి హైదరాబాదు నుంచి ఢిల్లీకి ప్రయాణం
Amit Shah going to Srisailam tomorrow
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. రేపు ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోన్నారు. అనంతరం అక్కడి నుంచే హెలికాప్టర్ లో శ్రీశైలంకు వెళతారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో ఆయన దర్శించుకుంటారు.

దర్శనానంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్ లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం.