హైకోర్టును కర్నూలుకు తరలించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి వైసీపీ ఎంపీల వినతి

11-08-2021 Wed 21:21
  • న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిసిన వైసీపీ ఎంపీలు
  • అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని వినతి
  • జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నపం
YSRCP MPs meets union law minister
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుని వైసీపీ ఎంపీలు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టును, జాతీయ న్యాయ యూనివర్శిటీని కర్నూలుకు తరలించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అనర్హత పిటిషన్లపై కూడా నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

ఫిరాయింపులకు పాల్పడే వారిపై గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని, ఎస్సీ కమిషన్ తరహాలో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కిరణ్ రిజుజును కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.