మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన 'శేఖర్'

11-08-2021 Wed 17:37
  • 91వ సినిమాగా 'శేఖర్'
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
  • దర్శకుడిగా లలిత్
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
Sekhar movie shooting re started
రాజశేఖర్ హీరోగా 'శేఖర్' సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా ఇది ఆయనకు 91వ సినిమా. లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అయింది. కొంతవరకూ చిత్రీకరణ జరిగిన తరువాత కరోనా తీవ్రరూపం దాల్చడంతో షూటింగును ఆపేశారు. అలాంటి ఈ సినిమా షూటింగు మళ్లీ ఈ రోజున మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

రాజశేఖర్ ఏదో ఆలోచన చేస్తూ అలా రోడ్డుపై నడచుకుంటూ వెళుతున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన లుక్ ఆయన వయసుకి తగినట్టుగానే ఉంది. ఈ సినిమాలో ఆయన విశ్రాంత పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. తాజా షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులంతా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

లక్ష్మీభూపాల్ కథను అందించిన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎం.ఎల్.వి. సత్యనారాయణ .. వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.