మనసులు కొల్లగొట్టిన 'శ్రీదేవి సోడా సెంటర్' సాంగ్

11-08-2021 Wed 11:17
  • సుధీర్ బాబు జోడీగా ఆనంది 
  • తాజాగా మరో పాట విడుదల
  • సిరివెన్నెల సాహిత్యం 
  • మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
Sridevi Soda Center lyrical song released
సుధీర్ బాబు .. ఆనంది జంటగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. లైటింగ్ సూరిబాబు - సోడాల శ్రీదేవి పాత్రల్లో కనిపించే నాయకా నాయికలపై ఈ పాటను చిత్రీకరించారు.

'నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది' అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ సంగీతానికి సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకి ప్రధానమైన బలం. కనుబొమలతో కబురంపినా .. మురిపాల మునక అంటూ తేలికైన పదాలతో సీతారామశాస్త్రి చేసిన ప్రయోగాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దినకర్ - రమ్య బెహ్రా ఆలాపన ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట యూత్ హృదయాలను కొల్లగొట్టేలానే సాగుతోంది. 'పలాస 1978' సినిమాతో ప్రశంసలను అందుకున్న కరుణ కుమార్, ఆ తరువాత చేసిన సినిమా ఇదే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.