ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

10-08-2021 Tue 20:14
  • కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • మరో కీలక బిల్లుకు ఆమోదం
  • ఓబీసీ బిల్లుకు మద్దతు తెలిపిన విపక్షాలు
  • ఓబీసీలను గుర్తించే అధికారం ఇక రాష్ట్రాలకే!
Lok Sabha gives nod for OBC Bill
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరో కీలక బిల్లు ఆమోదం పొందింది. ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. ఓబీసీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, పలు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించేందుకు మార్గం సుగమం అయింది.