బోయిన్ పల్లి పోలీసులపై కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌లో భూమా అఖిల ప్రియ ఫిర్యాదు

10-08-2021 Tue 14:52
  • తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదు 
  • సీసీ కెమెరా ఫుటేజీ అందజేత 
  • భార్గవ్ రామ్ కోసం వెళ్లామన్న పోలీసులు
Bhuma Akhilapriya complaints in KPHB police station
హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీసులపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. జులై 6న తమ ఇంట్లోకి పది మంది పోలీసులు అక్రమంగా ప్రవేశించారని తన ఫిర్యాదులో అఖిలప్రియ పేర్కొన్నారు. పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులకు ఆమె అందించారు.

మరోవైపు దీనిపై బోయిన్ పల్లి పోలీసులు స్పందిస్తూ... నకిలీ కోవిడ్ రిపోర్టు కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తప్పించుకుని తిరుగుతున్నారని... ఆయన కోసమే వారి ఇంటికి తాము వెళ్లామని చెప్పారు.