Abhiram: సముద్రఖని పారితోషికం ఒక రేంజ్ లో ఉందట!

  • కోలీవుడ్లో బిజీగా సముద్రఖని
  • తెలుగులో పెరుగుతున్న అవకాశాలు
  • సింపుల్ గా కనిపిస్తూనే విలక్షణ విలనిజం
  • 'ఆర్ ఆర్ ఆర్'లోను కీలక పాత్ర  
Teja movie update

తమిళనాట దర్శకుడిగా .. రచయితగా .. నటుడిగా సముద్రఖనికి మంచి గుర్తింపు ఉంది. తమిళ సినిమాకి అనువాదంగా వచ్చిన 'రఘువరన్ బీటెక్' సినిమా ద్వారా ఆయన ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సింపుల్ గా .. సీరియస్ గా కనిపిస్తూ ఆయన ప్రదర్శించే నటనకు చాలామంది కనెక్ట్ అయ్యారు. దాంతో తెలుగు నుంచి అవకాశాలు వెళ్లడం మొదలైంది.

'అల వైకుంఠపురములో' ఆయన పోషించిన అప్పలనాయుడు పాత్ర, 'క్రాక్' సినిమాలో చేసిన కటారి కృష్ణ పాత్రలతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఒక కొత్త తరహా విలనిజాన్ని ఆయన ఇక్కడివారికి పరిచయం చేశాడు. దాంతో 'ఆర్ ఆర్ ఆర్'తో సహా వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతున్నాడు. ఆ సినిమాల్లో తేజ సినిమా కూడా ఉంది.

రానా సోదరుడు అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సముద్రఖనిని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ ఇంకా ఖరారు కాలేదట. అందుకు కారణం ఆయన పారితోషికమేననే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఆయనకి ఇచ్చే పారితోషికం చాలా ఎక్కువవుతుందట. అయినా సురేశ్ బాబును ఒప్పించడానికి తేజ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.  

More Telugu News